వైయస్ఆర్‌సీపీతోనే బద్వేల్ అభివృద్ధి సాధ్యం
వైయస్ఆర్ కడప: వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంతోనే బద్వేల్ నియోజకవర్గం అభివృద్ధి సాధ్యమవుతుందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. బద్వేల్ ఉప ఎన్నిక ప్రచారంలో ఆయన పాల్గొని వైయస్ఆర్‌సీపీ అభ్యర్థిని డాక్టర్ దాసరి సుధాను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను మంత్రి అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రాష్ట్రంలో ప్రజలు బీజేపీకి ఓటు వేసే పరిస్థితి లేదని అన్నారు. 'బద్వేల్ నీటి సమస్యపై బహిరంగ చర్చకు సిద్ధం. టీడీపీ, బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో ట్యాంకర్లతో నీళ్లు తోలారు. మా ప్రభుత్వం వచ్చాక బ్రహ్మసాగర్ రిజర్వాయర్ ద్వారా సమృద్ధిగా నీరు అందిస్తున్నామన్నారు.. బద్వేల్ అభివృద్ధి కోసం మా ప్రభుత్వం ఎప్పుడూ చిత్తశుద్ధితో ఉందన్నారు. బీజేపీకి ఓటు వేస్తే చెల్లని ఓటుగా మిగులుతుందని అభిప్రాయపడ్డారు. వైయస్ఆర్‌సీపీని విమర్శించడమే అజెండాగా బద్వేల్ ఎన్నికలను బీజేపీ వాడుకుంటోందని మండిపడ్డారు.