ఆఫీస్ పెట్టి లంచాలు వసూలు చేసిన చరిత్ర కిరణ్ కుమార్ రెడ్డిది
1 Apr, 2024 10:49 IST
అనంతపురం: మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తీరుపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫైర్ అయ్యారు. ఆఫీస్ పెట్టి లంచాలు వసూలు చేసిన చరిత్ర కిరణ్ కుమార్ రెడ్డి ది అంటూ మంత్రి మండిపడ్డారు. సోమవారం మేమంతా సిద్ధం బస్సు యాత్రలో పాల్గొన్న మంత్రి పెద్దిరెడ్డి మీడియాతో మాట్లాడారు.
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏమన్నారంటే..
- సీఎం వైయస్ జగన్ బస్ యాత్ర కి అనూహ్యమైన స్పందన వస్తోంది
- నా రాజకీయ చరిత్రలో ఎన్నడూ చూడని జనం బస్సు యాత్రలో కనిపిస్తున్నారు
- 175 సీట్లు గెలుస్తామన్న నమ్మకం బస్ యాత్ర తో కలిగింది
- చంద్రబాబు కి రాయలసీమలో ఓటు అడిగే హక్కు లేదు
- రాయలసీమ లో ఒక్క ప్రాజెక్టు అయిన చంద్రబాబు కట్టాడా?
- సీఎం వైయస్ జగన్ రాయలసీమ లో ప్రాజెక్టు లు పూర్తి చేస్తున్నారు
- చంద్రబాబుని కుప్పంలో కూడా ఒడిస్తాం
- కుప్పానికి కూడా నీళ్లు ఇచ్చింది సీఎం వైయస్ జగన్
- సొంత జిల్లాకి కూడా మేలు చేయని వ్యక్తి చంద్రబాబు
- అమిత్ షా కాళ్ళు పట్టుకుని బీజేపీ తో చంద్రబాబు పొత్తు పెట్టుకున్నాడు
- రోజుల తరబడి ఢిల్లీలో పడిగాపులు కాసి పొత్తు పెట్టుకున్నాడు
- ఇప్పుడు బీజేపీ నే పొత్తు ఆడిగిందని అబద్దాలు చెప్తున్నాడు
- కిరణ్ కుమార్ రెడ్డి(మాజీ సీఎం) కి నా గురించి మాట్లాడే అర్హత లేదు
- ఆఫీస్ పెట్టి లంచాలు వసూలు చేసిన చరిత్ర కిరణ్ కుమార్ రెడ్డి ది
- ఎన్నికలు అవ్వగానే కిరణ్ కుమార్ రెడ్డి సూట్ కేస్ సర్దుకుని హైదరాబాద్ వెళ్ళిపోతాడు
- సీఎం పదవి కోసం రాష్ట్రాన్ని విడగొట్టిన ద్రోహి కిరణ్ కుమార్ రెడ్డి
- సీఎం వైయస్ జగన్ ని అనగదొక్కడానికి సోనియాగాంధీ తో కుమ్మక్కయ్యాడు
- ఇప్పుడు మేము ఓడించి బుద్ధి చెప్తామని మంత్రి పెద్దిరెడ్డి హెచ్చరించారు.