అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేయాలన్నదే సీఎం వైయస్ జగన్ లక్ష్యం
5 Dec, 2022 12:14 IST
కర్నూలు: రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేయాలన్నదే సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి లక్ష్యమని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. కర్నూలు గర్జనలో పాల్గొన్న మంత్రి మీడియాతో మాట్లాడారు. వికేంద్రకరణ కోసమే సీఎం వైయస్ జగన్ మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేయాలన్నదే సీఎం జగన్ లక్ష్యమని, ఆ దిశగా అడుగులు వేస్తున్నారని చెప్పారు. రాయలసీమలో పుట్టిన చంద్రబాబుకు ఈ ప్రాంత అభివృద్ధిపై అసలు చిత్తశుద్ధి లేదన్నారు. స్వప్రయోజనాలకోసమే చంద్రబాబు ఆరాట పడుతున్నారని మండిపడ్డారు.