కుప్పంలో సానుభూతి కోసం చంద్రబాబు తాపత్రయం
10 Nov, 2021 14:30 IST
చిత్తూరు: కుప్పంలో సానుభూతి కోసం చంద్రబాబు తాపత్రయపడుతున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. బుధవారం కుప్పంలో మంత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..గూండాగిరి రాజకీయాలకు చంద్రబాబు పెట్టింది పేరన్నారు. కుప్పం మున్సిపల్ కార్యాలయంపై టీడీపీ నేతలు దాడి చేశారని తెలిపారు. కార్యాలయ అద్దాలు, పర్నీచర్ ధ్వంసం చేశారని చెప్పారు.