చంద్రబాబుకు దమ్ముంటే తిరుపతి ఉప ఎన్నికను రెఫరెండంగా తీసుకోవాలి
తిరుపతి: ప‌్రతిపక్ష నేత చంద్రబాబుకు దమ్ముంటే తిరుపతి ఉప ఎన్నికను రెఫరెండంగా తీసుకోవాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సవాలు విసిరారు. చంద్రబాబు రెఫరెండంపై మంత్రి స్పందించారు. చంద్రబాబు రాజకీయాల్లో నుంచి తప్పుకుంటే ప్రజలు సంతోషిస్తారన్నారు. చంద్రబాబుకు సొంత జిల్లాలో జరిగే ఉప ఎన్నికలో గెలిచే పరిస్థితి లేదన్నారు. తిరుపతిలో ఓడిపోతే చంద్రబాబు రాజకీయ సన్యాసానికి సిద్ధపడాలన్నారు. మూడు రాజధానులు మా ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. చంద్రబాబు మోసం ఏంటో ప్రజలకు ఎప్పుడో తెలుసు అన్నారు. గత ఎన్నికల్లో 51 శాతం మంది ప్రజలు సీఎం వైయస్ జగన్‌కు తీర్పు ఇచ్చారని..ఇంతకంటే రెఫరెండం ఏముంటుందని మంత్రి ప్రశ్నించారు. చంద్రబాబుకు తిరుపతిలో రెండో స్థానమా? మూడో స్థానమో తేల్చుకోవాలన్నారు. తిరుపతి ఎన్నికతో ఎవరేంటో తేలిపోతుందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు.