గ్రామస్వరాజ్యం సీఎం వైయస్‌ జగన్‌తోనే సాధ్యం

7 Sep, 2019 12:15 IST

విశాఖపట్నం: మహాత్మాగాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం నెరవేస్తుందని పశు సంవర్ధక శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ అన్నారు. వంద రోజుల పాలనలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తనదైన ముద్ర వేసుకున్నారని ఆయన అన్నారు. విశాఖపట్నంలో మంత్రి మోపిదేవి వెంకట రమణ మీడియాతో మాట్లాడుతూ.. అవినీతి రహిత పాలనే సీఎం వైయస్‌ జగన్‌ ధ్యేయమన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ క్రమంగా నెరవేర్చుతున్నామని చెప్పారు. బాపూజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని వైయస్‌ఆర్‌ సీపీ ప్రభుత్వం నెరవేరుస్తుందన్నారు. కులాల మధ్య సమస్యలకు పరిష్కారం దిశగా జ్యూడిషియరి కమిటీ ఏర్పాటు చేశామన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి సీఎం వైయస్‌ జగన్‌ చరిత్ర సృష్టించారన్నారు. గత అసెంబ్లీ సమావేశాల్లో 19 బిల్లులు ప్రవేశపెట్టామని, వంద రోజుల్లో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నామన్నారు. ఇప్పుడు టీడీపీ పునాదులు కదులుతున్నాయనే ప్రభుత్వం చంద్రబాబు ఆరోపణలు చేస్తున్నారన్నారు. విశాఖ భూకుంభకోణంపై మరోసారి సిట్‌ ఏర్పాటు చేస్తామని, అవినీతికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.