రైతు సంక్షేమమే సీఎం వైయస్ జగన్ ధ్యేయం
12 Jul, 2020 19:20 IST
కాకినాడ: రైతుల సంక్షేమం కోసమే ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి పనిచేస్తున్నారని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. ఆదివారం కాకినాడలో మీడియా సమావేశంలో కన్నబాబు మాట్లాడుతూ..టీడీపీ హయాంలో రైతుల పట్ల సరైన విధానం పాటించలేదని, వారికి జరిగిన నష్టానికి చంద్రబాబే కారణమని విమర్శించారు. రైతుల సంక్షేమం కోసం వైయస్ఆర్ సీపీ ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తుంటే, కొన్ని పత్రికల్లో చిత్ర విచిత్రమైన కథనాలు వస్తున్నాయని ఆయన మండిపడ్డారు. గత ఐదేళ్లలో చంద్రబాబు వైఫల్యాలపై ఈనాడు పత్రిక కథనాలు ప్రచురిస్తే బాగుంటుందన్నారు. రైతులకు ఇచ్చిన హామీలపై వెనక్కి తగ్గకుండా అమలు చేస్తున్నామని మంత్రి కన్నబాబు తెలిపారు