చంద్రబాబు మరో కొత్త నియోజకవర్గం వెతుక్కుంటున్నారు
19 Feb, 2021 15:02 IST
విజయవాడ: చంద్రబాబు, లోకేష్ వార్డు మెంబర్లుగా కూడా గెలవలేరని మంత్రి కొడాలి నాని విమర్శించారు. చంద్రగిరిలో ప్రజలు ఓడించడంతోనే చంద్రబాబు కుప్పంకు వలస వెళ్లారన్నారు. ఇప్పుడు కుప్పం వదిలి మరో నియోజకవర్గం వెతుక్కుంటారని పేర్కొన్నారు. తిరుపతిలో బియ్యం పంపిణీ వాహనంలో లడ్డూల పంపిణీపై పూర్తిస్థాయిలో విచారణ చేయమని ఆదేశించామన్నారు. తిరుపతిలో లడ్డూలు పంపిణీ చేస్తే ఎన్నికల్లో గెలిచేస్తారా అని ప్రశ్నించారు. సోమువీ్రరాజు మాటలను ఆ పార్టీ కార్యకర్తలే పట్టించుకోరని తెలిపారు.