నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ చంద్రబాబు చేతిలో కీలుబొమ్మ 

2 Jan, 2021 17:05 IST

 విజయవాడ: ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు చేతిలో నిమ్మగడ్డ రమేష్‌ కీలుబొమ్మగా మారారని పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసం నిమ్మగడ్డ పనిచేస్తున్నారని దుయ్యబట్టారు. రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తులు కుల, మత, రాజకీయాల కతీతంగా పని చేయాలని హితవు పలికారు. నిమ్మగడ్డ రమేష్‌ ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోమని మంత్రి కొడాలి నాని హెచ్చరించారు.