ఎంత బలవంతులున్నా ఢీకొట్టే వ్యక్తి వైయస్ జగన్
విజయవాడ: అవతలి వైపు ఎంత బలవంతులున్నా ఢీకొట్టే వ్యక్తిగా వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఉన్నారని గూగుల్లో ఉందని మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు. దేశ చరిత్రలో ఏ సీఎం చేయని సంక్షేమ పథకాలు అమలు చేసిన వ్యక్తిగా వైయస్ జగన్మోహన్రెడ్డి ప్రజల్లోనే కాదు.. గూగుల్లో కూడా నిలిచిపోయారన్నారు. ముఖ్యమంత్రి ఏ మంచి పనిచేసినా అడ్డు పడాలనే దుర్మార్గులు రాష్ట్రంలో ఉన్నారని విమర్శించారు. ఎంతమంది దుర్మార్గులు కలిసి అడ్డుపడ్డా సీఎం వైయస్ జగన్ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రజల ఆశీస్సులతో సీఎం వైయస్ జగన్ నిజాయితీగా పాలన చేస్తున్నారని చెప్పారు. పదవీ విరమణ చేసిన ఓ న్యాయమూర్తి గూగుల్లో సీఎం గురించి సెర్చ్ చేస్తే ఏదో వస్తుందని తీర్పులో రాశారని తప్పుపట్టారు. పదవీ విరమణ చేసిన న్యాయమూర్తి గూగుల్లో సెర్చ్ చేస్తే వచ్చిందని ఆర్డర్లో పెట్టారన్నారు. తాను సీఎం వైయస్ జగన్ గురించి గూగుల్లో సెర్చ్ చేస్తే ఆయన కుటుంబ నేపథ్యముందని పేర్కొన్నారు. 2009లో రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు అవతలివైపు ఎంత బలవంతులున్నా ఢీకొట్టే వ్యక్తిగా గూగుల్లో ఉందని మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు.