గత ప్రభుత్వ హయాంలో అన్ని శాఖల్లో అవినీతి
విజయవాడ: గత ప్రభుత్వ హయాంలో అన్ని శాఖల్లో అవినీతి జరిగిందని మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. గుడివాడలో ప్రభుత్వ ఆసుపత్రిలో 50 పడకలవిభాగాన్ని మంత్రి కొడాలి నాని సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..గత ప్రభుత్వ హయాంలో అన్ని ప్రభుత్వశాఖల్లో అవినీతి జరిగిందన్నారు. ఈఎస్ఐలో ఇప్పటికే టీడీపీ నేత అచ్చెన్నాయుడు అరెస్టు అయ్యారన్నారు. చంద్రన్న కానుక, హెరిటేజ్ మజ్జిగ పంపిణీలో జరిగిన అక్రమాలపై ప్రాథమిక నివేదిక ఆధారంగా సీబీఐకి అప్పగించామన్నారు. ఫైబర్ గ్రిడ్ పేరుతో రూ. వెయ్యి కోట్లు చేతులు మారాయని కేబినెట్ సబ్ కమిటీ విచారణలో తేలిందన్నారు. పైబర్ గ్రిడ్‌లో జరిగిన అవినీతిపై కూడా సీబీఐ విచారణకు అప్పగించాలని సీఎంను కోరామన్నారు.
పట్టగిసీమ, పోలవరంతో పాటు అనేక ప్రాజెక్టుల్లో అవినీతి జరిగిందన్నారు.