జనసేన పార్టీకి దిశ, దశ ఏమైనా ఉందా?
అమరావతి: జనసేన పార్టీకి దిశ, దశ ఏమైనా ఉందా? అని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ప్రశ్నించారు. పవన్‌కు దమ్ముంటే 175 అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసే దమ్ముందా అని సవాలు చేశారు. కుల ప్రస్తావన గురించే పవన్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రజలకు మంచి చేస్తున్న సీఎం వైయస్ జగన్‌ను విమర్శించడమే పవన్ పని అన్నారు. చంద్రబాబు చేసిన వాగ్ధానాల గురించి పవన్ ఎందుకు మాట్లాడటం లేదని మండిపడ్డారు. దాచుకో, దోచుకో అనే పద్ధతిలో చంద్రబాబు పాలన ఉండేదని గుర్తు చేశారు. అన్ని వర్గాల ప్రజలకు సీఎం వైయస్ జగన్ సంక్షేమ పాలన అందిస్తున్నారని తెలిపారు. వంగవీటి రంగాను హత్యచేయించింది చంద్రబాబేనని హరిరామజోగయ్య తన పుస్తకంలో రాశారని చెప్పారు, రంగాను హత్య చేసిన వారినే పవన్ సమర్ధిస్తున్నారని తప్పుపట్టారు. విశాఖ సమ్మిట్ విజయవంతమైతే ఒక్కరైనా అభినందించారా అని ప్రతిపక్షాలను నిలదీశారు. సీఎం వైయస్ జగన్‌పై ధ్వేషంతో పవన్ మాట్లాడుతున్నారని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మండిపడ్డారు.