కాపు ఉద్యమ కేసుల ఉపసంహరణ చారిత్రక నిర్ణయం
3 Feb, 2022 12:22 IST
విజయవాడ: ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి కాపులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని, కాపులపై కేసులు ఎత్తేయడం చారిత్రక నిర్ణయమని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. చంద్రబాబు పాలనలో కాపులను సంఘ విద్రోహ శక్తులుగా చిత్రీకరించారని, కాపు రిజర్వేషన్ ఉద్యమంలో కాపులపై అక్రమ కేసులు పెట్టాడని మండిపడ్డారు. సంబంధం లేనివారిపై కేసులు పెట్టి చంద్రబాబు వేధింపులకు గురిచేశాడని ధ్వజమెత్తారు. నాడు చంద్రబాబు హయాంలో కాపు రిజర్వేషన్ కోసం ఉద్యమించిన కాపులపై అరాచకంగా, దుర్మార్గంగా నమోదు చేసిన కేసులు ఎత్తివేస్తూ వైయస్ జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం హర్షణీయమన్నారు.