మొబైల్ రైతుబజార్లు కూడా ఏర్పాటు చేస్తున్నాం
27 Mar, 2020 12:47 IST
తాడేపల్లి: ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మొబైల్ రైతుబజార్లను కూడా ఏర్పాటు చేస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు చెప్పారు. మంత్రి కన్నబాబు మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రాష్ట్రంలో నిత్యవసరాలు, కూరగాయలు అందుబాటులో ఉన్నాయన్నారు. అన్ని పట్టాణాల్లో రైతు బజార్లను వికేంద్రీకరించామని వివరించారు. మొబైల్ రైతుబజార్లను కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. నిత్యావసర వస్తువులు, కూరగాయల ధరలు పెంచి ప్రజలను ఇబ్బందులకు గురిచేసే వ్యాపారుల లైసెన్స్‌లు రద్దు చేస్తామని హెచ్చరించారు. ప్రజలు సామాజిక దూరం పాటించాలని సూచించారు.