రైతుల మనోస్థైర్యాన్ని దెబ్బతీసేలా బాబు మాటలు
తాడేపల్లి: రైతుల మనోస్థైర్యాన్ని దెబ్బతీసేలా ప్రతిపక్ష నేత చంద్రబాబు మాట్లాడుతున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
ముఖ్యమంత్రి ఆదేశాలతో యుద్ధప్రాతిపదికన చర్యలు:
- రాష్ట్రంలో తుపాను నేపథ్యంలో అధికారులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. యుద్ధప్రాతిపదికన విద్యుత్ పునరుద్ధరణ పనులు చేపట్టి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేశాం.
- వ్యవసాయ శాఖ, ఉద్యాన శాఖ, మత్స్య శాఖల అధికారులంతా ఎప్పటికప్పుడు రైతులకు అందుబాటులో ఉన్నారు.
- ఒక విపత్తను ఆపే పరిస్థితి ఎక్కడా ఉండదు. దానిని అడ్డుకోలేకపోయినా..ఆ సమయంలో ప్రజలకు, రైతులకు ఏ విధంగా అండగా నిలవగలిగాం అనేదే ప్రధానం.
- అన్ని రకాలుగా ముందస్తు హెచ్చరికలు చేశాం. ఆయా జిల్లాల్లో మంత్రులు, ఉన్నతాధికారులు రైతుల సేవలో ఉన్నారు.
- ముఖ్యమంత్రి గారు ఇప్పటికే జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు పూర్తి స్థాయి ఆదేశాలు ఇచ్చారు. ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారు.
రైతుల్లో మనోస్థైర్యాన్ని నింపాలనే ఇంగిత జ్ఞానం బాబుకు లేకుండా పోయింది:
- రాష్ట్రంలో శవాలపై చిల్లర వేరుకునే బ్యాచ్‌లా ప్రతిపక్షాలు తయారయ్యయాయి.
- 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబుకు ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ఏ విధమైన సూచనలు సలహాలు ఇవ్వాలో, రైతుల్లో ఎలా మనోస్థైర్యం నింపాలనే ఇంగిత జ్ఞానం లేకుండా పోయింది.
- ఆయన మాటలు చూస్తుంటే ఈ విపత్తు జరగాలి అని చంద్రబాబు కోరుకున్నట్లుంది.
- నేనున్నప్పుడు ఎక్కువ పరిహారం ఇచ్చాను..ఇప్పుడు తక్కువ ఇస్తున్నారు అని బాబు చెప్పడం, ఆయన పత్రికలు బాకా ఊదడం మొదలు పెట్టాయి.
- ఈ రోజు మేం అనుసరిస్తున్న విధివిధానాలన్నీ మీ హయాంలో పెట్టినవేనని నేను ఆనాడు అసెంబ్లీ సాక్షిగా చెప్పాను.
- ఆ తర్వాత జగన్ గారు రైతులకు ఇవ్వాల్సిన నష్టపరిహారాన్ని పెంచి జీవోలు ఇచ్చారు.
- ఏదో ఒక విధంగా కష్టకాలంలో రైతులను రెచ్చగొట్టి ప్రభుత్వంపై బురదజల్లాలని చూస్తున్నాడు.
- రైతులు చంద్రబాబును ఛీ కొట్టారు కాబట్టి చెప్పుకోడానికి ఏమీ లేదు..అందుకే ఈ ప్రభుత్వం కూడా ఏమీ చేయలేదని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.
- రైతు నష్టపోవాలి...రైతు కష్టాల్లో ఉండాలి..దాని ద్వారా తాను బురదజల్లి లబ్ధిపొందాలనే లక్ష్యం తప్ప రైతు సుఖంగా ఉండాలని మాత్రం కాదు.
దేశంలో ఎక్కడాలేని విధంగా ఉచిత పంటల బీమా అమలు చేస్తోంది మన రాష్ట్రమే:
- నిన్నటి వరకూ టీడీపీ నాయకులంతా కరవు అంటూ మొసలి కన్నీరు కార్చారు.
- ఇప్పుడు వర్షం రాగానే వారంతా ముసుగు తన్ని పడుకున్నారు.
- ఇక వారి కోసం పచ్చ పత్రికలు రోజుకో అసత్య కథనాలు రాస్తూ వస్తున్నారు. ఈ రోజు ఉచిత పంటల బీమా గురించి రాశారు.
- దేశంలో ఎక్కడా లేని విధంగా వైఎస్సార్ ఉచిత పంటల బీమా అమలు చేస్తున్న రాష్ట్రం మన రాష్ట్రమే.
- రైతులకు ఒక్క పథకం లేదంటూ చంద్రబాబు మొసలి కన్నీరు కారుస్తుంటాడు.
- బాబులా రైతుల పేరు చెప్పి దోచుకునేలా నీరు చెట్టు పథకాలు మా వద్ద లేకపోవచ్చు. కానీ రైతులకు మేలు చేసే పథకాలు మాత్రం మేం స్పష్టంగా అమలు చేస్తున్నాం.
- వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ప్రజలకు నూటికి నూరు శాతం మేలు చేసే పథకాలున్నాయి.
- చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతు తన వాటాను చెల్లిస్తే..రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం వారి వారి వాటాలు చెల్లించేవి.
- ముఖ్యమంత్రిగా జగన్మోహన్‌రెడ్డి గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత రైతులు, కేంద్రం చెల్లించాల్సిన ప్రీమియం వాటాను కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది.
- వైఎస్సార్ ఉచిత పంటల బీమా వచ్చిన తర్వాత పంటలు వేసి నోటిఫై చేసిన పంటలకు ఇన్సూ్యరెన్స్ ప్రీమియం కట్టే విధంగా చర్యలు తీసుకున్నాం.
- ఏ రోజైతే కేంద్రం అధీనంలో ఉన్న బీమా నుంచి మన రాష్ట్రం బయటకు వచ్చిందో ఇతర రాష్ట్రాలు కూడా మన బాటలోకి వచ్చాయి.
- దీంతో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రిక్వెస్ట్ చేసి మీరు కోరినట్లే యూనివర్సల్ బీమా కిందకు తీసుకొస్తాం అని చెప్తే మనం మళ్లీ ప్రధాన మంత్రి పసల్‌బీమా పరిధిలోకి వెళ్లాం.
- ఈ ప్రభుత్వం రైతుల బీమా ప్రీమియం మొత్తం రాష్ట్ర ప్రభుత్వం వంద శాతం భరించింది.
బాబు పాపాలే...రైతులకు శాపాలు:
- చంద్రబాబు చేసిన అనేక పాపాలు రైతులకు శాపాలుగా మారితే వాటిని సరిదిద్దాం.
- బాబు హయాంలో రూ.119.44 కోట్లు రైతులకు ఎగ్గొట్టి వెళితే... కేంద్రం, ఇన్సూ్యరెన్స్ కంపెనీలతో మాట్లాడి ఆ డబ్బు రైతులకు ఇప్పించాం.
- వీటికి తోడు చంద్రబాబు ఎగ్గొట్టిన రూ.596 కోట్లతో మొత్తం రూ.715.84 కోట్ల బకాయిలను ఈ ప్రభుత్వం చెల్లించింది.
- ఈ క్రాపింగ్ చేసి రైతులకు రశీదులు కూడా ఇచ్చాం. దాంట్లో ఏంత విస్తీర్ణంలో సాగు చేశారనే అంశాలను పొందుపరుస్తూ ప్రీమియం ఎంత ఇచ్చామో కూడా పేర్కొన్నాం.
- ప్రీమియం కూడా కట్టిన తరవాత ఈనాడులో ఈ రోజు ఒక రోత రాతలు రాశారు.
- చంద్రబాబు కారుకూతలు కూసి కంపు కోడుతున్నట్లే..రామోజీ రోత రాతలతో రైతులకు లేని అనుమానాలు కల్పించే ప్రయత్నం చేస్తున్నాడు.
- 2023 ఖరీఫ్‌లో అన్ని రకాల పంటలు కలిపి 93 లక్షల ఎకరాలను ఈ క్రాపింగ్ కింద నమోదు చేశాం.
- వీటికి అదనంగా ఖరీఫ్ 2023 దిగుబడి ఆధారంగా 13 పంటలు, 4 పంటలు వాతావరణ ఆధారంగా నమోదు చేశాం.
- ఎప్పుడైనా, ఎక్కడైనా రైతులు మిగతా రాష్ట్రాల్లో కామన్ సర్వీస్ సెంటర్ ద్వారా తమ వాటా చెల్లిస్తారు.
- ఆ వాటా చెల్లించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వ వాటా చెల్లిస్తుంది. దాని ద్వారా వివరాలు వెంటనే అక్కడ కనిపిస్తాయి.
- మన రాష్ట్రానికి సంబంధించి నేరుగా ఈ క్రాప్ ద్వారా నోటిఫైడ్ పంటల వివరాలను నేరుగా ఇన్సూ్యరెన్స్ కంపెనీలకు, కేంద్రానికి పంపుతాం. వారు నేరుగా దాంట్లో నమోదు చేస్తారు.
టెస్టింగ్ చేస్తున్నా రోత రాతలు రాస్తే ఎలా రామోజీ..?:
- మనం ఖరీఫ్ ఈ క్రాప్ డేటా అక్టోబర్ 31 కల్లా పంపడం జరిగింది.
- రబీ వివరాలు కూడా మార్చి కల్లా పంపుతాం. మన వద్ద ఎక్కడా పెండింగ్ లేదు.
- కేంద్రానికి సంబంధించిన టెక్నికల్ టీం టెస్టింగ్ కోసం ఈ క్రాప్ డేటాను ఆ పోర్టల్‌లో నమోదు చేయడానికి టెస్టింగ్ కోసం కొన్ని పేర్లు ఉంచారు.
- బుద్ది, జ్ఞానం ఉన్న వాడు 0.04 హెక్టార్లకు ఎవరన్నా బీమా చేస్తారా?
- వారు టెస్టింగ్ కోసం ఏదో పది పేర్లు పెడితే ఈనాడు రోత రాతలు రాయడం సరైంది కాదు.
- భారత ప్రభుత్వానికి ఇప్పటికే మనం డేటా మొత్తం పంపాం.
- ఆ డేటా మొత్తం ఫసల్ బీమా పోర్టల్‌లో ప్రదర్శించడం జరుగుతుంది.
- డేటా ఎంట్రీ అనేది సాంకేతిక పరమైన అంశమే తప్ప రైతులకు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
- ఇప్పటికే నోటిఫికేషన్ ద్వారా ఎంత పంట వేశారో ఇచ్చాం..ప్రీమియం కట్టేశాం.
- ఖరీఫ్ 2023లో నోటిఫై చేసిన 70.80 లక్షల ఎకరాలకు సంబంధించిన 34.70 లక్షల మంది రైతుల సమచారాన్ని అక్టోబర్‌లోనే కేంద్రానికి పంపాము.
- కానీ ఏదో ఒక రకంగా బురదజల్లే రాతలు రాయాలని, ఇబ్బందికర పరిస్థితులు తీసుకొచ్చి రైతుల్లో అయోమయ పరిస్థితులు తేవాలని రామోజీ రాశారు.
ఇవి పరిపక్వత ఉన్న వాడు రాసే రాతలు కాదు:
- ఇవి తలమాసిన వాడు రాసే రాతలు తప్ప పరిపక్వత ఉన్న వాడు రాసే రాతలు కాదు.
- టెస్టింగ్ చేస్తున్నా దాని మీద వాస్తవాలు తెలుసుకోకుండా రాతలు రాస్తున్నారు.
- రైతులకు గందరగోళం ఏమీ లేదు..రామోజీ తల చెడి ఆయనకు గందరగోళంగా ఉంది.
- ప్రతి రైతుకు బీమా చేశాం అని భౌతికంగా రసీదు ఇస్తే ఇక రైతు గందరగోళ పడాల్సిన అవసరం ఏముంది..?
- అనేక సందర్భాల్లో ఇలాంటి రాతలు రాస్తున్నారు. రాసిన ప్రతి సందర్భంలో రామోజీరావుకు గడ్డి పెట్టినా సిగ్గు శరం ఏమీ ఉండటం లేదు.
- ఏదో ఒకటి రాద్దాం..బురదజల్లుదాం అనేదే ఆయన బాధ.
- ఎంత త్వరగా చంద్రబాబును ఆ సీట్లో కూర్చోబెట్టాలనేదే ఆయన తాపత్రయం.
- ఆయన బతికుండగానే చంద్రబాబును ఆ సీట్లు కూర్చోబెట్టాలని కంపు రాతలు రాస్తున్నాడు.
- కాబట్టి రైతులు ఎవరూ ఇటువంటి అడ్డగోలు రాతలు రాస్తే పత్రికలను చదవకండి..చూడకండి.
అడగకపోయినా వైఎస్సార్ ఉచిత పంటల బీమా తెచ్చిన సీఎం వైఎస్ జగన్:
- రైతులు అడగకపోయినా వారి ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని జగన్ గారు ఉచిత బీమా అందిస్తుంటే..ఆ మైలేజ్ చెడగొడదామని రోజుకో రాతలు రాస్తున్నారు.
- క్రమం తప్పకుండా బీమా చెల్లింపులు చేస్తున్నాం. ఇన్‌పుట్ సబ్సిడీ సైతం సీజన్ ముగిసే లోపునే ఖాతాల్లో వేస్తున్నాం.
- కష్ట కాలం ప్రతి రైతు కుటుంబాన్ని ఆదుకునే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
- రైతు బాగుంటేనే..రాష్ట్రం బాగుంటుందని విశ్వసించిన ముఖ్యమంత్రి గారు అన్నీ సక్రమంగా అమలు చేస్తారు.
- నేడు తుపాను వల్ల నష్టపోయిన రైతులందరికీ న్యాయం చేస్తాం.
- రేపటి నుంచి తుపాను వల్ల నష్టపోయిన పంట అంచనాలు ప్రారంభం అవుతాయి.
- నీరు బయటకు వెళ్లిన తర్వాత అంచనా వేయడానికి అవకాశం ఉంటుంది.
- 10వ తేదీ కల్లా ఎంత నష్టం జరిగిందనేది పూర్తి అంచనాలు వస్తాయి.
- వచ్చిన నివేదికను కూడా రైతు భరోసా కేంద్రాల్లో సోషల్ ఆడిట్‌కి కూడా పెడతాం.
- ఎవరైనా రైతులకు జరిగిన నష్టం దానిలో నమోదు కాకపోతే మళ్లీ నమోదు చేసి ఫైనల్ నివేదిక రూపొందిస్తాం.
- వీరి రోత రాతలు చేసి, ప్రతిపక్షాల అబద్ధపు ప్రచారాలు చూసి రైతులు ఎవరూ అందోళన చెందాల్సిన అవసరం లేదు.
- రైతులకు ప్రతి క్షణంలోనూ అండగా నిలిచే ప్రభుత్వం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం.