ఖరీఫ్ నాటికి రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు
కాకినాడ: వచ్చే ఖరీఫ్ నాటికి రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేస్తామని మంత్రి కన్నబాబు పేర్కొన్నారు. వ్యవసాయ అనుబంధ శాఖల మధ్య అనుసంధానం, సమన్వయం ఉండాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి కన్నబాబు తెలిపారు. జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా, వ్యవసాయ శాఖ జేడీ కన్వీనర్‌గా కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రస్థాయిలో వ్యవసాయ శాఖ ప్రత్యేక సీఎస్ చైర్మన్‌గా కమిటీ ఉంటుందన్నారు. కేంద్ర అధికారులు కూడా రైతు భరోసా కేంద్రాలను అభినందిస్తున్నారని పేర్కొన్నారు. ఈ-కర్షక్ నమోదు లేకపోయినా కందులు, శనగలు రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తామని ప్రకటించారు. మార్క్‌ఫెడ్ ద్వారా 98 కందులు కొనుగోలు, 100 శనగల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. కందులు, శనగల ఉత్పత్తులను ఆఫ్‌లైన్ ద్వారా కొనుగోలుకు అనుమతిచ్చినట్లు చెప్పారు.నాఫైడ్ ద్వారా కూడా కందులు, శనగలు కొనుగోలు చేస్తున్నామని మంత్రి కన్నబాబు వెల్లడించారు.