మేలైన నూతన వంగడాలను ఆవిష్కరించిన మంత్రి కాకాణి
3 Nov, 2022 12:41 IST
అమరావతి: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి 2022లో వివిధ పంటలలో అభివృద్ధి చేసిన మేలైన నూతన వంగడాలు ను ఆవిష్కరించారు. వెలగపూడిలోని సచివాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి నూతన వంగడాలను పరిశీలించి, వాటిని ఆవిష్కరించారు. రైతుల ఆదాయం రెట్టింపు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందన్నారు. నకిలీ విత్తనాలను అరికడుతూ మేలైన విత్తనాలను అందిస్తున్నామని తెలిపారు.