రైతులకు అండగా ఉంటాం
19 Apr, 2022 14:23 IST
నెల్లూరు: విత్తు నుంచి విక్రయం వరకూ రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి రైతు సంక్షేమానికి పెద్దపీట వేశారన్నారు. రైతులకు మద్దతు ధర వచ్చేలా పౌర సరఫరాల శాఖతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేసి వారికి మేలు జరిగేలా చూస్తామని చెప్పారు. మంగళవారం మంత్రి మీడియాతో మాట్లాడారు. పార్టీలోని నేతలందరం కలిసిమెలిసి పని చేస్తున్నామని తెలిపారు. మాజీ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్‌కు నాకు మధ్య ఉన్న సహాయ సహకారాలు మీడియాకు తెలియదన్నారు. తాను రెట్టింపు సహకారం అందిస్తానని చెప్పారు. పార్టీలో ఉన్న అంతర్గత విషయాలు అన్నది మా ఇద్దరి మధ్యలో ఉన్న అంశం. మంత్రిగా ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి ప్రభుత్వం ఫ్రోటోకాల్ ప్రకారం అందరికీ ఆహ్వానం అందించింది. మా మధ్య భేదాభిప్రాయాలు ఏమీ లేవన్నారు.