రోడ్డు భద్రత అందరి బాధ్యత
2 Feb, 2023 18:19 IST
నెల్లూరు: రోడ్డు భద్రత అందరి బాధ్యత అని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. గురువారం వెంకటాచలం రహదారిపై "జాతీయ రహదారి భద్రత వారోత్సవాలు" సందర్భంగా నిర్వహించిన హెల్మెట్ ర్యాలీ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్థన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హెల్మెంట్ ధరించి ద్విచక్ర వాహనం నడిపారు. ప్రతిఒక్కరూ హెల్మెట్ తప్పనిసరిగా వినియోగించాలని ఆయన పిలుపునిచ్చారు. మానవ తప్పిదాలతో 91 శాతం ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. రోడ్డు భద్రతా మార్గదర్శకాలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలకు అవగాహన కల్పించడంతో ప్రమాదాలను నివారించవచ్చన్నారు.