పంటనష్టపోయిన రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటాం
14 Dec, 2022 11:35 IST
నెల్లూరు: తుపాన్ ప్రభావంతో పంటనష్టపోయిన రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా మనుబోలు మండలం వీరంపల్లిలో మంత్రి కాకాణి పర్యటించారు. భారీ వర్షాల కారణంగా నీట మునిగిన పంటపొలాలను మంత్రి కాకాణి పరిశీలించారు. ప్రభుత్వం రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. 80 శాతం సబ్సిడీతో ఆర్బీకేల ద్వారా విత్తనాలు అందిస్తామని చెప్పారు. ముందస్తు చర్యలతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదన్నారు. దెబ్బతిన్న పంటలకు ఇన్‌పుట్ సబ్సిడీ అందించాలని సీఎం ఆదేశించారని చెప్పారు. టీడీపీ నేతలు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని, వ్యవసాయంపై అవగాహన లేనివారు మాటలను తాము పట్టించుకోమని మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి చెప్పారు.