త్వరలో జరగబోయేది టీడీపీ శవయాత్రే
15 Sep, 2022 09:49 IST
అమరావతి: అసెంబ్లీ సమావేశాల మొదటి రోజే టీడీపీ సభ్యులు సభను అడ్డుకోవడం పట్ల మంత్రి జోగి రమేష్ మండిపడ్డారు. టీడీపీ నేతలు రాజకీయ నిరుద్యోగులుగా మారిపోయారని ధ్వజమెత్తారు. టీడీపీ సభ్యులకు చర్చించే దమ్ము లేదు. చంద్రబాబు ఆదేశాలతోనే సభను అడ్డుకుంటున్నారని ఫైర్ అయ్యారు. త్వరలో జరగబోయేది టీడీపీ శవయాత్రే అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఆ పార్టీకి చిత్తశుద్ధి లేదు: ఎమ్మెల్యే టీజేఈఆర్ సుధాకర్‌బాబు
అమరావతి: ప్రజా సమస్యలపై టీడీపీ పార్టీకి చిత్తశుద్ధి లేదని వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు మండిపడ్డారు . చంద్రబాబు ఎలా ఉన్నారో.. వాళ్ల నాయకులు కూడా అలానే ఉన్నారు. టీడీపీకి నైతిక హక్కు లేదని విమర్శించారు.