వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వంలో రైతే రాజు
11 Dec, 2020 13:22 IST
కర్నూలు: వైయస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతే రాజు అని మంత్రి గుమ్మనూరు జయరాం పేర్కొన్నారు. కర్నూలు జిల్లాలో వేదవతి ప్రాజెక్టుకు మంత్రి గుమ్మనూరు జయరాం భూమి పూజ చేశారు. రూ.1600 కోట్లతో వేదవతి ప్రాజెక్టు పనులను ఇవాళ మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా జయరాం మాట్లాడుతూ..గత ప్రభుత్వం రైతులను నట్టేట ముంచిందన్నారు. సీఎం వైయస్ జగన్ రైతు పక్షపాతి అన్నారు. వేదవతి ప్రాజెక్టు కింద 80 వేల ఎకరాలకు సాగునీరు అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు.