సంక్రాంతి ప్యాకేజీ కోసమే చంద్రబాబు ఇంటికి పవన్

8 Jan, 2023 16:46 IST

విశాఖ‌ప‌ట్నం: ప్యాకేజ్‌ స్టార్‌ పవన్ సంక్రాంతి పండుగ మామూలు కోసం చంద్రబాబు ఇంటికి వెళ్ళాడ‌ని, ఇద్దరి భేటీ కొత్త కాదని ప‌రిశ్ర‌మ‌లు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమ‌ర్‌నాథ్ అన్నారు. మంత్రులపై జన సైనికులు దాడి చేస్తే చంద్రబాబు పరామర్శిస్తారు. చంద్రబాబు సభలో జనం చనిపోతే పవన్ కల్యాణ్ బాబు ఇంటికి పరామర్శకు వెళ్లడం విడ్డూరంగా ఉంద‌న్నారు. ప‌వ‌న్‌, చంద్ర‌బాబు ఇద్ద‌రూ జనాన్ని మోసగించడం పనిగా పెట్టుకున్నారన్నారు. అమాయకపు జనసేన కార్యకర్తలను పవన్‌ అమ్మకానికి పెట్టారన్నారు. పవన్‌ సీఎం అవుతారని జనసేన కార్యకర్తలు అంటారు. కానీ అది ఎలా సాధ్యం..? అని ప్ర‌శ్నించారు. చంద్రబాబు వేసే ఎంగిలి మెతుకులన్ని సీట్లతో పవన్‌ మ్యాజిక్‌ ఫిగర్‌ ఎలా చేరుకుంటారు?  అని నిల‌దీశారు.