సమగ్ర సర్వేలో సాంకేతికత కూడా కీలకం

26 Sep, 2023 10:33 IST

అమ‌రావ‌తి:  సమగ్ర సర్వేలో సాంకేతికత కూడా కీలకంగా వ్యవహరిస్తోంద‌ని మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు పేర్కొన్నారు. దీని వ‌ల్ల ఫోర్జరీలకు అవకాశం లేకుండా పోయిందన్నారు. సంస్కరణల అమలులో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటున్నామ‌ని, ప్రతీ పథకం ప్రజలకు చేరువ చేయడమే ప్రభుత్వ లక్ష్యమ‌ని మంత్రి వివ‌రించారు.