చంద్రబాబు ట్రాప్ లో జంగా కృష్ణమూర్తి
తాడేపల్లి: చంద్రబాబు ట్రాప్ లో ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి పడ్డారని సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ మండిపడ్డారు. బీసీల అభ్యున్నతి కోసం సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి గారి ప్రభుత్వం ఎంత పాటు పడుతుందో ఆయనతో సహా అందరికీ తెలుసు అన్నారు.
సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ మీడియాతో ఇంకా ఏం మాట్లాడారంటే:
బీసీల ఆత్మగౌరవ రక్షకుడు వైయస్ జగన్ :
– ఈ రోజు ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి మాటలు బీసీల అందరినీ బాధకు గురిచేశాయి.
– బీసీల అభ్యున్నతి కోసం జగన్‌మోహన్‌రెడ్డి గారి ప్రభుత్వం ఎంత పాటు పడుతుందో ఆయనతో సహా అందరికీ తెలుసు.
– మన రాష్ట్రంలో 11 మంది బీసీ మంత్రులున్నారు...వారివద్దే కీలకమైన శాఖలన్నీ ఉన్నాయి.
– బీసీల అవసరాలు తీర్చడానికి బీసీలు మాత్రమే ప్రాధాన్యం ఇవ్వగలరని ఆలోచించి బీసీలకు మంత్రివర్గంలో అత్యధికంగా వారికి ఇచ్చారు.
– నేతి బీరకాయలో నెయ్యి ఉండదు..టేస్ట్ ఉంటుంది...జగన్ గారి పాలనలో బీసీలు ఆత్మగౌరవంతో తలెత్తుకు తిరుగుతున్నారు.
– గతంలో చంద్రబాబు బీసీలను ఏ విధంగా అణచివేశాడో మనమే స్పష్టంగా చెప్పాం.
– నలుగురు బీసీలు రాజ్యసభకు వెళ్లారు. మరో ఎస్సీ సోదరుడు రాజ్యసభకు ఇప్పుడు వెళ్తున్నాడు.
– ఈ నెయ్యి వాసన ఇప్పుడు కనిపించడం లేదా జంగా కృష్ణమూర్తి?
– మీ ఆలోచన వేరే ఉందని అర్ధం అయింది. వెళ్తూ వెళ్తూ నింద వేయడం మీ స్థాయికి సరైంది కాదు.
– మీరు జగన్ గారి వద్ద విధేయంగా ఉన్నారు. జగన్ గారు కూడా మీపట్ల అదే విధంగా వ్యవహరించారు.
– మీరు ఏ ప్రతిపాదన చేసినా జగన్ గారు దాన్ని అమలులో పెట్టారు.
– ప్రభుత్వం అంటే పాలకులం కాదు సేవకులం అన్నాడు జగన్ గారు.
– గత ప్రభుత్వం ఒక ఇస్త్రీ పెట్టె ఇచ్చి చేతులు దులుపుకుంటే ఈ ప్రభుత్వం బీసీలకు ఎంత ఇచ్చిందో నీకు తెలియదా?
– రాజకీయ దోపిడీ లేకుండా పేదరిక నిర్మూలనకు కృషి చేస్తున్న ఈ ప్రభుత్వం దేశంలోనే ఒక బెంచ్ మార్క్.
– ఇంత కాలానికి బీసీల ఆత్మగౌరవ రక్షకుడిగా వచ్చిన వ్యక్తి జగన్ గారు.
– ఆయన తీసుకున్న సంస్కరణల వల్ల మనం ఆరాధించే మహాత్మ జ్యోతిరావుపూలే ఆశయం నెరవేరుతోంది.
– అంబేద్కర్ ఆలోచనలకు అనుగుణంగా సమసమాజం కోసం రాష్ట్రంలో పరిపాలన సాగుతోంది.
టంకుటమార విద్యలు నేర్చిన చంద్రబాబు ట్రాప్‌లో జంగా పడ్డారు:
– మీ చూపు పక్కకు ఉండొచ్చు..మీరు ఆయన ట్రాప్‌లో పడ్డారని అనుకుంటున్నా.
– టంకుటమారం విద్యలు తెలిసిన ఆయన వల వేస్తున్నారు. దానిలో మీరు పడి ఇలాంటి మాటలు మాట్లాడటం సమంజసం కాదు.
– మీ మాటలు బీసీలకు మనోవేదనను కలిగిస్తున్నాయి. అది మీ స్థాయి కాదు.
– నాలుగు రోజుల్లో కులగణన కూడా పూర్తి అవుతోంది. అది జరిపించిన బీసీల ఆత్మగౌరవం తీరుస్తున్న జగన్ గారిపై నిందలు వేయడానికి నీకు మనసు ఎలా వచ్చింది?
– మీరు సీటు ఆశించి ఉండొచ్చు..అది దక్కకపోయి ఉండొచ్చు..
– పక్కవాడు ఆఫర్ చేసి ఉండొచ్చు..టీడీపీ ఆఫర్ చేసి ఉండొచ్చు..ప్రలోభపెడుతుంది కూడా.
– దానికి మీరు నాయకుడిపై నింద వేసేస్తారా? ఆయనపై నిందలు వేసి బీసీల ఆత్మగౌరవం గురించి మాట్లాడటం చాలా బాధ కలిగించింది.
– రాష్ట్రంలో 2.55 లక్షల కోట్లు ప్రజల ఖాతాల్లోకి వెళ్తే దాంట్లో 1.80 లక్షల కోట్లు బీసీల ఖాతాల్లోకి వెళ్లింది.
– 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇస్తే అందులో అత్యధిక శాతం మన బీసీలే.
– టీడీపీ ప్రలోభంతో నాయకుడిపై నింద వేస్తే బీసీలు నమ్ముతారని చంద్రబాబు అనుకుంటాడు..కానీ నమ్మరు.
– బీసీలకు రాజ్యాధికారం జగనన్నకే సాధ్యం అనడానికి మనిద్దరం సా«క్ష్యం.
– బీపీ మండల్ శిష్యుడు చెప్పారు ఇందే అంశాన్ని. దానికి మీరు కూడా సాక్షి.
– సామాజిక న్యాయం అనే పదానికి చిరునామా ఆంధ్రప్రదేశ్ అని ఆయన చెప్పారు.
– మనకు రాలేదని, ఆశించింది దక్కలేదని పక్కవాడు ఇచ్చిన స్క్రిప్ట్‌ను పలకడం బీసీల నమ్మకంపై దెబ్బకొట్టడమే.
– అందుకే గౌరవంగా మీతో కలిసి మెలిగిన వ్యక్తిగా కోరుతున్నా. మీరు చేసిన ఆరోపణలు ఆలోచించి ఉపసంహరించుకుంటే బాగుంటుంది.
– ఆ ప్రలోభాలకు జంగా కృష్ణమూర్తి లొంగకూడదని బీసీల తరఫున సూచన చేస్తున్నాను.
– ఆశయం కోసమే పనిచేస్తున్న నాయకుడు జగన్ గారు. ఆయనకు మనమంతా వెన్నంటి ఉండాలి.
– మీరు టీడీపీకి వెళ్లాలంటే వెళ్లండి..ఆయన పదవి ఇస్తానంటే తీసుకోండి.
– కానీ మీరు మీ గౌరవాన్ని తగ్గించుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను.