చంద్రబాబు గత ఢిల్లీ పర్యటనలపై చర్చిద్దామా?
అమరావతి: చంద్రబాబు గత ఢిల్లీ పర్యటనలపై చర్చిద్దామా..? అని టీడీపీ నేతలకు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి సవాలు విసిరారు. సభను పక్కదారి పట్టించేందుకు టీడీపీ ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. శనివారం ఉదయం టీడీపీ సభ్యులు సభను అడ్డుకోవడంతో మంత్రి బుగ్గన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బుగ్గన మాట్లాడుతూ.. సీఎం వైయస్ జగన్ ఢిల్లీ పర్యటనలో రాష్ట్ర ప్రయోజనాలపై చర్చించారని అన్నారు. విభజన వల్ల పెండింగ్‌లో ఉన్న సమస్యలపై చర్చించారని తెలిపారు. పోలవరం నిధులపై ప్రధానితో సీఎం చర్చించారని పేర్కొన్నారు. సభలో టీడీపీ సభ్యులు అనవసర రాద్దాంతం చేస్తూ సమయాన్ని వృథా చేస్తున్నారని ధ్వజమెత్తారు. టీడీపీ హయాంలో పోలవరంలో జరిగిన తప్పులపై చర్చిద్దామా?. చంద్రబాబు హయాంలో చేసిన అప్పులు, పెట్టిన బకాయిలపై చర్చిద్దామా?’’ అంటూ మంత్రి బుగ్గన సవాల్ విసిరారు.