టీడీపీ ప్రతి రోజూ ఓ డ్రామా
4 Dec, 2020 09:38 IST
అమరావతి: అసెంబ్లీలో విలువైన సమయాన్ని ప్రతిపక్షం వృథా చేస్తోందని ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు.ఐదు రోజు అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ సభ్యులు పోడియం వద్దకు వెళ్లి సభను అడ్డుకోవడంతో మంత్రి తీవ్రంగా ఖండించారు.టీడీపీ సభ్యులు చెప్పే అడ్జెండ్ మోషన్‌పై ప్రతి రోజు చర్చించాం. అయినా కూడా ప్రతి రోజు ఏదో ఒక డ్రామా చేస్తూ సభను అడ్డుకుంటున్నారు. నిన్న బడుగు, బలహీన వర్గాల గురించి లంచ్ కూడా చేయకుండా చర్చించాం. వాళ్ల ఫార్మెట్‌ను ఇవ్వమనండి..చర్చిస్తాం. స్పీకర్ చెప్పేది కూడా వినడం లేదు. పోడియం దిగి సరైన ఫార్మెట్లో వస్తే చర్చిస్తామని గడికోట శ్రీకాంత్‌రెడ్డి చెప్పారు.