ఆ రోజు చర్యలు తీసుకోలేదేం?
11 Jul, 2019 16:55 IST
అమరావతి: అసెంబ్లీలో కరవుపై, రుతుపవనాలు రాకపోవడంపై చర్చ జరుగుతోందనీ, ఇందులో భాగంగా ప్రతిపక్ష నేత చంద్రబాబుకు రూ.కోటి ఇస్తామని మాత్రమే సీఎం జగన్ హుందాగా చెప్పారని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తెలిపారు. ఎక్కడో ఎమ్మెల్యేను అడ్డుకుంటే చట్టాలు ఉన్నాయనీ, పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. ‘ఒకటి అడుగుతా అధ్యక్షా.. ఇదే నిండు సభలో మా నాయకుడు ప్రతిపక్ష నేతగా ఉండగా ఆయన్ను పాతిపెడతామన్నారు కదా అధ్యక్షా.. మరి ఆ రోజు చర్యలు లేవే అధ్యక్షా? మనం అడుగుతా ఉండేది ఏమీ? మంచి హుందాగా ప్రతిపక్షానికి కూడా అవకాశం ఇస్తాం. మీరు ధన్యవాదాలు, అభినందలు తెలిపితే బాగుంటుంది అని చెప్పాం అధ్యక్షా’ అంటూ తన ప్రసంగాన్ని ముగించారు.