వ్యక్తిగత అంశాలకు సభలో చోటులేదు
15 Mar, 2023 09:49 IST
అమరావతి: వ్యక్తిగత అంశాలకు సభలో చోటులేదని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో రెండో రోజు ప్రశ్నోత్తరాల సమయంలో ప్రతిపక్ష సభ్యులు సభకు అడ్డుతగలడంతో మంత్రి స్పందించారు. ప్రజా సమస్యలు ఏమైనా ఉంటే సంబంధింత మంత్రులు, అధికారులకు వినతిపత్రం ఇస్తే పరిష్కరిస్తాం. ఎక్కడ ఏ వేదిక మీద ఎలా ప్రస్తావించాలో తెలుసుకోవాలి’’ అంటూ మంత్రి బుగ్గన హితవు పలికారు.
కాగా, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తీరుపై స్పీకర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. సమస్యలు ఉంటే వినతి పత్రం సభ నిబంధనలకు అనుగుణంగా ఇవ్వాలని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. సభలో ఇలా వ్యవహరించడం సమంజసం కాదన్నారు.