సభా సమయం వృథా చేయవద్దు
16 Mar, 2022 09:51 IST
అమరావతి: టీడీపీ సభ్యులు రోజూ సభను అడ్డుకుంటున్నారని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మండిపడ్డారు. టీడీపీ సభ్యుల తీరును ఆయన తప్పుబట్టారు. సభా సమయాన్ని వృథా చేయవద్దని సూచించారు. సభలో పలు శాఖల డిమాండ్లను మంత్రులు ప్రవేశపెడుతుండగా టీడీపీ సభ్యుల తీరు మారలేదు. ఏడో రోజు కూడా సభా కార్యక్రమాలకు అడ్డుపడుతున్నారు. స్పీకర్ పోడియం వద్ద టీడీపీ సభ్యులు నినాదాలు చేస్తున్నారు.