ఓటమి భయం ఉన్న పార్టీలే పొత్తులు..!
7 Jul, 2023 18:07 IST
విశాఖ: రాబోయే ఎన్నికలలో వైయస్ఆర్ సీపీ సింగిల్ గానే పోటీ చేస్తుందని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ఓటమి భయం ఉన్న పార్టీలే పొత్తుల కోసం పాకులాడుతాయంటూ సెటైర్లు వేశారు. ముందస్తు ఎన్నికలు ఉండవని ఆయన స్పష్టం చేశారు. వచ్చే ఏడాది మార్చిలోనే సాధారణం ఎన్నికలు జరుగుతాయని వెల్లడించారు. మా నాయుకులు వైయస్ జగన్ ప్రతి సభలోనూ చెప్పునట్టు అభివృద్ధి, సంక్షేమ పథకాలే మా అజెండా.. కాబట్టి వచ్చే ఎన్నికల్లో వేరే పార్టీలతో మాకు పొత్తు అవసరం లేదన్నారు.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను దాదాపుగా అన్ని పూర్తి చేశాం.. సంక్షేమ పథకాలతో మా ప్రభుత్వంపై ప్రజలకు మరింత నమ్మకం పెరిగిందన్నారు. గత ఎన్నికల్లో సాధించిన స్థానాల కంటే.. వచ్చే ఎన్నికల్లో అధిక సీట్లనే గెలిచుకుంటామనే నమ్మకాన్ని మంత్రి బొత్స సత్యానారాయణ వ్యక్తం చేశారు.