హరీష్‌రావు బాధ్యతగా మాట్లాడాలి

13 Apr, 2023 17:42 IST

విజయవాడ:  తెలంగాణ మంత్రి హరీష్‌రావు బాధ్యతగా మాట్లాడాలని మంత్రి బొత్స సత్యనారాయణ హితవు పలికారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..అమరావతి పేరుతో చంద్రబాబు భూములు దోచుకున్నారని విమర్శించారు. సీఎం వైయస్‌ జగన్‌ పాలనలో ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని చెప్పారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మరలా వైయస్‌ జగనే సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేశారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను మొదట మేమే వ్యతిరేకించామని, ప్రైవేటీకరణను ఆపాలని సీఎం వైయస్‌ జగన్‌ కేంద్రానికి లేఖ రాశారని, ప్రధాని నరేంద్రమోదీని కలిసి విజ్ఞప్తి చేశారని గుర్తు చేశారు.