చైర్మన్ పోడియం ఎక్కిన టీడీపీ ఎమ్మెల్సీలపై చర్యలు తీసుకోవాలి
23 Mar, 2022 13:18 IST
అమరావతి: శాసనమండలిలో తెలుగుదేశం పార్టీ సభ్యుల తీరు బాధాకరమని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. సభ సజావుగా జరగనివ్వకుండా చైర్మన్ పోడియం వద్ద టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. టీడీపీ ఎమ్మెల్సీలు చైర్మన్ పోడియం ఎక్కి గందరగోళ వాతావరణాన్ని సృష్టించడంపై మంత్రి బొత్స అభ్యంతరం వ్యక్తం చేశారు. సభలో టీడీపీ సభ్యుల తీరు బాధాకరమని, గందరగోళం సృష్టించడం మంచిపద్ధతి కాదన్నారు. చైర్మన్ స్థానాన్ని టీడీపీ సభ్యులు అగౌరవ పరుస్తున్నారని, పోడియంపైకి ఎక్కిన సభ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.