పట్టణ ప్రాంతాల్లో పేదలకు ఇళ్లు
30 Jul, 2019 10:53 IST
అమరావతి: పీఏంఏవై పథకం కింద పట్టణ ప్రాంతాల్లో పేదలకు ఇళ్లు కేటాయిస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. గత ప్రభుత్వం 7 లక్షల ఇళ్లు మంజూరు తీసుకొని 3 లక్షల ఇళ్లు మాత్రమే ప్రారంభించిందన్నారు. కానీ ఈనాటి వరకూ ఒక్కటి కూడా లబ్ధిదారునికి అందలేదన్నారు. గత ప్రభుత్వం చదరపు అడుగు రూ.2311 లబ్ధిదారుడు కట్టాలన్నారు. 300 చదరపు అడుగుల ఇల్లు ఖర్చు దాదాపు రూ.7 లక్షలు అవుతుందని అంత డబ్బు పేదలు ఎక్కడి నుంచి తెస్తారని ప్రశ్నించారు. గత ప్రభుత్వ విధానాలతో పేదలపై రుణభారం పడిందన్నారు.