చంద్రబాబుది ఎప్పుడూ క్రిమినల్ ఆలోచనలే
20 Oct, 2021 11:43 IST
విజయనగరం: ప్రతిపక్ష నేత చంద్రబాబుది ఎప్పుడూ క్రిమినల్ ఆలోచనలేనని మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. సీఎం వైయస్ జగన్‌పై టీడీపీ నేత పట్టాభి వ్యాఖ్యలు అభ్యంతరకరమని మంత్రి ఖండించారు. టీడీపీని నిషేధించాలని ఎన్నికల కమిషన్‌ను కోరుతామని బొత్స తెలిపారు. టీడీపీ నేతల భాషను పవన్, సోము వీ్రరాజు ఎందుకు ఖండించడం లేదని ఆయన ప్రశ్నించారు. టీడీపీ నేతలు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హితవు పలికారు.