ప్రజల భద్రతే ముఖ్యం..కంపెనీ కాదు

9 May, 2020 13:04 IST

విశాఖ: ఎల్‌జీ పాలిమర్స్‌ గ్యాస్‌ లీకేజీ ఘటనపై విచారణ జరిపిస్తున్నామని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చెప్పారని మంత్రులు బొత్స సత్యనారాయణ, కన్నబాబు, అవంతి శ్రీనివాస్‌ పేర్కొన్నారు. ప్రజల భద్రతే ముఖ్యమని, కంపెనీ ముఖ్యం కాదని వారు స్పష్టం చేశారు.  ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా కల్పించారు. శనివారం మంత్రులు మీడియాతో మాట్లాడారు.

ఎల్‌జీ పాలిమర్స్‌ యాజమాన్యం పట్ల ప్రభుత్వం కఠినంగానే ఉటుందని, ప్రతిపక్షాలు ప్రజలను పక్కదోవ పట్టించవద్దని సూచించారు.రాజకీయాలకు ఇది సమయం కాదన్నారు. సున్నిత సమయంలో ప్రజలను రెచ్చగొట్టే చర్యలకు దిగొద్దని కోరారు.ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని,కరోనా దృష్ట్యా పరిస్థితులను అర్థం చేసుకోవాలన్నారు.మృతదేహాలను త్వరగా తరలించి అంత్యక్రియలు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు సహకరించాలని మంత్రులు కోరారు. ప్రజల భద్రత కోసం ఎలాంటి చర్యలైనా తీసుకుంటామని చెప్పారు.