చంద్రబాబు, పవన్‌కు పొత్తులు షరా మామూలే!
17 Jan, 2020 13:14 IST
ఒంగోలు: విమర్శించిన పార్టీలతో పొత్తులు పెట్టుకోవడం చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌కు షరా మామూలే అని మంత్రి బాలినేని శ్రీనివాసులురెడ్డి విమర్శించారు. ఎవరు ఎవరితో పొత్తులు పెట్టుకున్నా..మేం పట్టించుకోం. మాకెలాంటి అభ్యంతరం లేదు. వైయస్ జగన్ మొదటి నుంచి కూడా ఎవరితో పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగా వెళ్తున్నారు. వైయస్ జగన్ నాయకత్వంలో ప్రజలు సంతోషంగా ఉన్నారు. అన్ని పార్టీలు కలిసి వచ్చినా..వైయస్‌ఆర్‌సీపీ ఒంటరిగానే పోటీ చేస్తుంది.