మహిళల ఆర్థికాభివృద్ధే సీఎం వైయస్ జగన్ ధ్యేయం
3 Feb, 2022 12:40 IST
ఒంగోలు: ప్రకాశం జిల్లా అద్దంకి పట్టణంలో ఏర్పాటు చేసిన జగనన్న మహిళా మార్ట్‌ను రాష్ట్ర విద్యుత్, అటవీశాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. మహిళలు వారి కాళ్ల మీద వారు నిలబడాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అనేక పథకాలు అమలు చేస్తున్నారని చెప్పారు. మహిళా ఆర్థికాభివృద్ధే సీఎం ధ్యేయమన్నారు. ఈ కార్యక్రమంలో శాప్ నెట్ కార్పొరేషన్ చైర్మన్, అద్దంకి నియోజకవర్గ వైయస్ఆర్ సీపీ ఇన్‌చార్జ్ బాచిన కృష్ణచైతన్య, మున్సిపల్ చైర్మన్ ఎల్.ఎస్తేరమ్మ, వైస్ చైర్మన్‌లు దేసు పద్మేష్, కె.అనంతలక్ష్మి, కౌన్సిలర్లు, మండల అధ్యక్షురాలు అవిసన జ్యోతి, పార్టీ పట్టణ అధ్యక్షుడు కాకాని రాధాకృష్ణ, మండల కన్వీనర్ జ్యోతి హనుమంతరావు, సర్పంచ్ లు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.