ఉనికి కోసమే టీడీపీ విమర్శలు
10 Apr, 2021 17:52 IST
నెల్లూరు: తిరుపతి ఉప ఎన్నికలో ఉనికి కోసమే టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. శనివారం నెల్లూరు జిల్లాలో తిరుపతి ఉప ఎన్నిక వైయస్ఆర్ సీపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి తరఫున నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి, రవీంద్రనాథ్‌రెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..కార్పొరేటర్‌గా కూడా గెలవలేని లోకేష్‌కు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నారు. తిరుపతి ప్రజలు టీడీపీకి డిపాజిట్లు కూడా ఇచ్చే పరిస్థితి లేదన్నారు. లోకేష్ ప్రజల్లో నుంచి వచ్చిన నేత కాదన్నారు.అవగాహన లేకుండా లోకేష్ ప్రచారానికి రావడం సిగ్గు చేటు అన్నారు.