స్టీల్ ప్లాంట్‌పై చంద్రబాబుది పూటకో మాట
22 May, 2021 16:53 IST
విశాఖపట్నం: స్టీల్ ప్లాంట్‌పై చంద్రబాబు పూటకో డ్రామాలు ఆడుతున్నారని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ ధ్వజమెత్తారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం చంద్రబాబు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. మంత్రి అవంతి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రజల ఆకాంక్షల మేరకు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి తీర్మానం చేశారని గుర్తుచేశారు. ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ప్రధానమంత్రి నరేంద్రమోడీకి రెండుసార్లు సీఎం లేఖ రాశారన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను అడ్డం పెట్టుకొని చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తున్నారని మంత్రి అవంతి మండిపడ్డారు.