తక్షణమే చంద్రబాబు క్షమాపణ చెప్పాలి
21 Oct, 2021 12:31 IST
విశాఖ: విద్వేషాలను రెచ్చగొట్టి ఉనికి చాటుకునేందుకు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు డైరెక్షన్‌లో సాగుతున్న బూతు పురాణాన్ని ప్రజలు ఛీత్కరించుకుంటున్నారని మంత్రి అవంతి శ్రీనివాస్ పేర్కొన్నారు. విశాఖలో గురువారం నిర్వహించిన జనాగ్రహ దీక్షలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..దుర్భాషలాడటం వాక్ స్వాతంత్య్రం ఎలా అవుతుందని మండిపడ్డారు. రెండున్నరేళ్లుగా సంక్షేమాభివృద్ధి పథకాలతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్న సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డికి దన్నుగా నిలుస్తున్నారని చెప్పారు. సీఎం వైయస్ జగన్‌ను టీడీపీ నేత పట్టాభితో తీవ్ర పదజాలంతో దూషింపజేసిన చంద్రబాబు క్షమాపణ చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు.