సినిమా ప్రమోషన్ కోసమే ఏపీకి పవన్
29 Dec, 2020 15:10 IST
విశాఖ: సినిమా షూటింగ్ లేదు కాబట్టే పవన్ కల్యాణ్ ఏపీకి వచ్చాడని, ఆరు నెలలకు ఒకసారి వచ్చి నోటికి వచ్చినట్లుగా మాట్లాడుతున్నాడని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ ధ్వజమెత్తారు. మంత్రులు కొడాలి నాని, పేర్ని నానికి పవన్‌కల్యాణ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. విశాఖలో మంత్రి అవంతి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ.. తన సినిమా ప్రమోషన్ కోసమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పవన్ కల్యాణ్ వచ్చాడన్నారు. 6 నెలలకు ఒకసారి హైదరాబాద్ నుంచి ఏపీకి వస్తున్నాడన్నారు. చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ కూడా టైంపాస్‌కు వచ్చినట్టుగా రాష్ట్రానికి వస్తున్నారన్నారు. ఇలాంటి వ్యక్తులకు రాష్ట్ర ప్రజల గురించి, ప్రభుత్వం గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు.