బ్యాడ్మింటన్ అకాడమీకి ఐదు ఎకరాలు
13 Sep, 2019 12:53 IST

అమరావతి: విశాఖలో బ్యాడ్మింటన్ అకాడమీకి 5 ఎకరాలు ఇస్తామని సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారని మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు మరిన్ని పతకాలు సాధించాలని సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆకాంక్షించారని మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. ఇవాళ ఉదయం పీవీ సింధు ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎం వైయస్ జగన్ సింధును అభినందించారు. అనంతరం ఆ వివరాలను మంత్రి అవంతి శ్రీనివాస్ మీడియాకు వివరించారు. సింధుకు అన్ని విధాలుగా ప్రభుత్వం సహకారాలు అందిస్తుందని సీఎం చెప్పారన్నారు. బ్యాడ్మింటన్ క్రీడాకారులను ప్రోత్సహించాలని సీఎం సూచించినట్లు తెలిపారు.