వైయస్ జగన్ చిత్తశుద్ధిపై అనుమానం వద్దు
17 Jun, 2019 11:27 IST
అమరావతి: ముఖ్యమంత్రి వైయస్ జగన్ చిత్తశుద్ధిని ఎవరు కూడా శంకించాల్సిన అవసరం లేదని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. శాసన మండలిలో జరిగిన గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. గతంలో చంద్రబాబు వైయస్‌ఆర్‌సీపీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారు. వారిపై అప్పట్లో అనర్హత వేటు వేయలేదు. ప్రత్యేక హోదా విషయంలో వైయస్ జగన్ మొదటి నుంచి ఒకే తీరుగా ఉన్నారు. హోదా కోసం మా పార్టీ కట్టుబడి ఉంది.