మార్చిలో పదోతరగతి వార్షిక పరీక్షలు
7 Jan, 2022 16:12 IST
గుంటూరు: పదో తరగతి వార్షిక పరీక్షలు మార్చిలో నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. సంక్రాంతి నాటికి సిలబస్ పూర్తికావాలని, విద్యార్థులను పరీక్షలకు సన్నద్ధం చేయాలని ఇప్పటికే ఆదేశాలిచ్చామన్నారు. 15–18 ఏళ్లలోపు విద్యార్థులకు 95 శాతం వ్యాక్సినేషన్ పూర్తిచేశామని చెప్పారు. మంత్రి ఆదిమూలపు సురేష్ మీడియాతో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ ప్రజల విశ్వాసం కోల్పోయిందన్నారు. చంద్రబాబు కంచుకోట కుప్పంలో టీడీపీ ఘోర ఓటమే ఇందుకు నిదర్శనమని చెప్పారు.