టీడీపీ సభ్యులకు ప్రజా సమస్యలు వినే ఓపిక లేదు
1 Dec, 2020 09:57 IST
అమరావతి: టీడీపీ సభ్యులకు ప్రజా సమస్యలు వినే ఓపిక లేదని మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ అన్నారు. అసెంబ్లీలో టీడీపీ రచ్చ చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. ‘ప్రతిపక్ష సభ్యులు నిన్న వ్యవసాయ రంగంపై చర్చ అంటే సీఎం జగన్ పెద్ద మనసుతో మిగతా అంశాలను పక్కనపెట్టి అంగీకరించారు. చర్చ ప్రారంభించిన తర్వాత డ్రామా క్రియేట్ చేసి రచ్చ చేశారు. ఈరోజు హౌసింగ్‌పై చర్చ అడిగారు. సరే ఇస్తామంటే.. లేదు లేదు ఇప్పుడే చర్చించాలని టీడీపీ సభ్యులు పట్టుబడుతున్నారు. ఏ అంశంపైనా అయినా చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, టీడీపీ సభ్యులు ఇంత భయపడుతున్నారేందుకు?’ అని మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ ప్రశ్నించారు.