శ్రీశైలం డ్యామ్ భద్రతకు ఎలాంటి ముప్పులేదు
21 Nov, 2019 14:17 IST
విజయవాడ: శ్రీశైలం ప్రాజెక్ట్, డ్యామ్ భద్రతకు ఎలాంటి ముప్పు లేదని జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్ స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు, ఎల్లోమీడియా అసత్య ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు. ప్రజల్లో లేనిపోని అనుమానాలు, అపోహాలు సృష్టించొద్దని సూచించారు. శ్రీశైలం డ్యామ్ సేఫ్టీకి అన్ని చర్యలు తీసుకున్నామని మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్ పేర్కొన్నారు.