పెద్దన్నను కోల్పోయినట్లు ఉంది
22 Feb, 2022 14:13 IST
నెల్లూరు: గౌతమ్‌రెడ్డి లేరన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని ఏపీ ఇరిగేషన్ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. నెల్లూరులోని మేకపాటి క్యాంపు కార్యాలయంలో మంత్రి మాట్లాడారు. గౌతమ్‌రెడ్డి చాల విషయాల్లోనూ నన్ను వెన్నుతట్టి ప్రోత్సహించేవారన్నారు. పెద్దన్నను కోల్పోయినట్లు ఉందన్నారు. అధికారదర్పం ఉండేది కాదని.. అందరితోనూ స్నేహంగా ఉండేవారన్నారు.