కరోనా కన్నా అతిపెద్ద వైరస్ చంద్రబాబే
తాడేపల్లి: రాష్ట్రంలో కరోనా కంటే చంద్రబాబే అతిపెద్ద వైరస్ అని మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్ మండిపడ్డారు. తన సామాజిక వర్గం కోసమే రమేష్‌కుమార్ ఎన్నికలు వాయిదా వేశారని పేర్కొన్నారు. వాయిదా వేసే సమయంలో వైద్య ఆరోగ్య శాఖను సంప్రదించలేదని తప్పుపట్టారు. తాడేపల్లిలోని వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని, అధికారులను సంప్రదించకుండా ఎన్నికలు వాయిదా వేశారు. అలాంటి నిర్ణయం తీసుకునే సమయంలో ప్రభుత్వాన్ని సంప్రదించాలి కదా? కనీసం రాష్ట్రానికి సంబంధించిన హెల్త్ బులిటెన్ విడుదల చేయాలి కదా? హెల్త్ సెక్రటరీ, చీఫ్ సెక్రటరీలను సంప్రదించకుండానే నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల కమిషనర్ రమేష్‌కుమార్ తన కూతురికి గతంలో చంద్రబాబు పదవి ఇచ్చినందుకు రుణం తీర్చుకుంటున్నారా?. ఎవరితో సంప్రదించకుండానే ఎన్నికలు వాయిదా వేశారు. రాత్రి ఎవరితోనే ఫోన్లో మాట్లాడి, పొద్దునే ఎన్నికలు వాయిదా వేస్తున్నానని ప్రకటించారు. కరోనా సాకు చూపుతూనే కలెక్టర్లు, ఎస్పీలను బదిలీ చేశారు. గతంలో మీ కూతురు నిమ్మగడ్డ శరణ్య మూడేళ్ల పాటు ఇదే రాష్ట్రంలోని డైరెక్టర్ ఎకనామిక్ ఫోరంలో పని చేశారు. అప్పుడు చంద్రబాబు పదవి ఇచ్చారని ఇవాళ ప్రతిఫలంగా ఎన్నికలు వాయిదా వేశారా?. ప్రాన్స్ దేశంలో 5,500 కరోనా వైరస్ పాసిటివ్ కేసులు నమోదు అయినా, 127 మంది చనిపోయినా నిన్న అక్కడ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించారు. 55 శాతం పోలింగ్ జరిగింది. రాష్ట్రానికి కరోనా కన్న పెద్ద వైరస్ చంద్రబాబే. కరోనా రోగులను ఐసోలేషన్‌లో పెడితే కనీసం నయం అవుతుంది. కానీ చంద్రబాబు కన్నా దుర్మార్గమైన వైరస్, రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న వైరస్ చంద్రబాబే. ఆరు నెలల పాటు ఎన్నికలు నిర్వహించకపోతే అప్పటి దాకా ఎన్నికల కోడ్ వర్తిస్తుందా అని మంత్రి అనిల్ ప్రశ్నించారు.