టీడీపీ వీడి మరో పార్టీ పెట్టి పోటీకి రండి
7 Feb, 2020 15:51 IST
కర్నూలు: ఎన్టీ రామారావు స్థాపించిన టీడీపీని వదిలేసి..మరో పార్టీ పెట్టి పోటీకి రావాలని ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుకు మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ సవాలు విసిరారు. ఎన్టీఆర్‌పై ఉన్న అభిమానంతో టీడీపీకి ఓట్లు పడుతున్నాయి తప్ప..చంద్రబాబును చూసి ఎవరు వేయడం లేదన్నారు. చంద్రబాబు వెంట ఉన్నది ఎన్టీఆర్ అభిమానులే అన్నారు. తాను మంత్రి కంటే ముందు వైయస్ జగన్ భక్తుడినని పేర్కొన్నారు. వైయస్ జగన్ మూడో కన్ను తెరిస్తే చంద్రబాబు భస్మంం అయిపోతాడని పేర్కొన్నారు.